మధుమేహం రోగాన్ని తగ్గించుకొని ఆరోగ్యవంతులవడానికీ దాన్ని దూరం గా ఉంచేందుకు పది సూత్రాలు
మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు కొన్ని:
మైదా, రిఫైన్డ్ చక్కర పదార్థాల వాడకం,
పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారం గా సేవించడం,
అధికం గా తెల్ల చక్కర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ ల సేవనం, వందల కొద్దీ రసాయనాలు వేసిన -ప్యాక్ చేసిన ఆహారాలు కొనుక్కొని తినడం, తీవ్రత తో కూడిన జీవన శైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు; emotions, వ్యాపారం లో నష్టాలూ, ప్రేమ వైఫల్యాలు క్లోమ గ్రంధి ని ఆవహించిన ఇన్ఫెక్షన్ లూ, అంటి బయాటిక్ ల విపరీతఫలితాలు ఇందుకు చెప్పుకో దగ్గ కొన్ని కారణాలు.
గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే 'మధు మేహం' మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. అది కళ్ళ కూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హృదయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదడు కూ కూడా రోగాలు తెచ్చి పెడ్తుంది.
మధుమేహం2' - ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు పది సూత్రాలు:
i) 8 నుండి 12.5% పీచు పదార్థం లేదా ఫైబర్ కలిగిన సిరి ధాన్య (మిల్లెట్ ) ల ను ముఖ్య ఆహారం గా స్వీకరించడం.
వరి, గోధుమలతో పీచు పదార్థం/ఫైబర్ ౦.2 నుండి 1.2 మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది.
కానీ సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే.
రోజు కొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి.(అదే ధాన్యాన్ని)
ఇలా 5 ధాన్యాలనూ రోజూ మార్చుకోవాలి.
కుటుంబం లో అందరికీ చిన్న నాటి నుండే వీటి యందు అవగాహన పెంచటం.
ii) రోజూ 50 నుండి 70 నిముషాలు నడవటం.
iii ) అధికం గా ఆకూ కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపం లో తినడం.
iv ) మునగ ఆకూ, కాయలూ, మెంతులూ, మెంతికూర, ఆలో వేరా, కాకర కాయ, బెండ కాయ, జామ కాయల వాడకం పెంచుకోవడం, జామ, మామిడి ఆకులూ డికాక్షన్ ని ఉదయాన్నే త్రాగటం.
v ) పాల వాడకం మానివేయడం.పెరుగు, మజ్జిగ ల రూపంలోనే వాటిని స్వీకరించటం. కొని తినే ప్యాకెడ్ ఆహారాలను దూరం పెట్టడం,
vi) మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనె లను దూరం గా ఉంచడం, గానుగ నూనెలో, organic cold-pressed నూనెలో వాడుకోవడం.
vii ) మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం.
viii ) వరి అన్నం, గోధుమలు, మైదా పదార్థాలూ అతి తక్కువ వాడటం లేదా పూర్తి గా దూరం గా ఉంచడం.
ix ) HFCS హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ , తెల్ల చక్కర లు వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను రక్షించుకోవడం,
x) మధు మేహం2 - అందరికీ వచ్చేదే కదా అనే 'అల్ప ధోరణి' లేకుండా ఈ వ్యాధిని శాశ్వతం గా దూరం గా ఉంచే మార్గాలు పాటించడం, వ్యాధి వస్తే తప్పక సరైన ఆహారం, మారిన జీవన శైలి తో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంట కీ readings కాకుండా HbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయం గా సరైన పద్దతి లో తెలుసుకోండి.
Post a Comment