వేడి వేడి టీ కాఫీ తాగినా డేంజ‌రే

వేడి వేడి టీ కాఫీ తాగినా డేంజ‌రే..

Drinking too hot tea coffee affect your health

ఒక కప్పు చాయ్‌ చూడగానే కొందరిలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ముఖ్యంగా పని ఉక్కిరి బిక్కిరిలో ఉన్నవాళ్లకి వేడి వేడి చాయ్‌ గొంతులో పడితే అదొక రిలీఫ్‌. అయితే, ఇలా వేడి వేడిగా తాగడం అస్సలు మంచిది కాదని.. ఈసోఫేగస్‌ క్యా న్సర్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.

గొంతు నుంచి పొట్ట దాకా ఆహారాన్ని చేర్చేగొట్టం వంటి భాగాన్ని ఈసోఫేగస్‌(అన్నవాహిక)అంటారు. వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ గొంతునాళంపై ప్రభావంపడుతుంది. అది మంట, పుండ్లకు దారితీస్తుంది. ఇది ఎక్కువైతే ఈసోఫేగస్‌ క్యాన్సర్ వచ్చేఅవకాశం ఉంటుంది. కేవలం టీ, కాఫీలే కాదు..వేడిగా ఉండే ఏ ద్రవాలైనా సరే ఆరోగ్యంపైప్రభావం చూపుతాయని పరిశోధకులు చెప్తు-న్నారు. జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్ లో ఈ పరిశోధనకుసంబంధించిన ఆర్టికల్‌ ప్రచురితమైంది.

Drinking too hot tea coffee affect your health
Drinking too hot tea coffee affect your health

ఈసోఫాగస్‌ క్యాన్సర్ లక్షణాలు


గొంతునొప్పి , గొంతు మంటబరువు తగ్గడం,గుండెలో మంట..

స్టడీ

కాఫీ, టీలు తాగుతున్న 40 నుంచి 75 మధ్యవయసున్న వాళ్లలో సుమారు 50వేలమందిపైఈ పరిశోధన జరిగింది. ఇందులో దాదాపు317 మందికి ఈసోఫేగస్‌ క్యాన్సర్ వచ్చింది.‘చాలామందికి ఉదయాన్నే ఎక్కువగా టీ,కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. అతిశీతలదేశాల్లో అయితే కొందరు వేడివేడి ఆల్కహాల్‌నితీసుకుంటారు. అత్యంత వేడిగా ఉండే ఈలిక్విడ్‌ వల్ల గొంతునాళానికి వేడి పుట్టి పుండ్లుఅవుతాయి. ఇవి క్యాన్సర్ కి దారితీసే అవకాశంఉంది’ అని అమెరికా క్యాన్సర్ సొసైటీకి చెందినపరిశోధకులు తెలిపారు. అలాగని హాట్‌ డ్రింక్స్‌ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సాధా-రణంగా మనం తాగే కాఫీ, టీలు 70 నుంచి80 డిగ్రీల వరకు వేడిగా ఉంటాయి. అలాతాగకుండా కాస్త చల్లారిన తర్వాత తాగడం వల్లఈ సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నా రుపరిశోధకులు. వేడి కాఫీ, టీలు ఎక్కువగాతాగడంతో పాటు.. వారానికి 14 గ్లాసులకిమించి ఆల్కహాల్ తీసుకున్నా , ధూమపానంఎక్కువైనా ఈ క్యాన్సర్‌ వస్తుంది.

సంవత్సరానికినాలుగు లక్షల మంది ఈసోఫేగస్‌ క్యాన్సర్‌ కారణంగా చనిపోతున్నా రు.వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య అధికంగాఉంటుంది. చల్లని నీళ్లు ఎంత తాగినా గొంతుపొడిబారుతూనే ఉంటుంది. అలాంటప్పుడుఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగడం వలనగొంతు పొడిబారకుండా ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post