కొర్ర ఇడ్లీ తయారు చేయు విధానము

Foxtail Millet కొర్ర ఇడ్లీ తయారు చేయు విధానము

Foxtail Millet Idli Recipe Making In Telugu

కావలసినవి:

కొర్రల రవ్వ – 3 కప్పులు,
మినప్పప్పు – ఒక కప్పు
నెయ్యి/నూనె – తగినంత,
ఉప్పు – తగినంత

తయారీ:

మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి. కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి.

పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి సుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి.
Foxtail Millet కొర్ర ఇడ్లీ తయారు చేయు విధానము
Foxtail Millet కొర్ర ఇడ్లీ తయారు చేయు విధానము

ఇడ్లీరేకులకు నెయ్యి/నూనె పూసి, పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి.

వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

కొర్రలు (Foxtail Millet)
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57.

Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa |  Foxtail Millet Bread | Foxtail Millet  Cabbage Muthia | Foxtail Millet  Halwa | Foxtail Millet  Thipi Pongal | Foxtail Millet  Roti | Foxtail Millet kobbari Annam |

Post a Comment

Previous Post Next Post