కొర్ర బిస్కెట్లు తయారు చేయు విధానము తెలుగులో

కొర్ర బిస్కెట్లు తయారు చేయు విధానము తెలుగులో

Foxtail Millet Biscuits Recipe Making In Telugu

కావలసినవి:

కొర్ర పిండి – ఒక కప్పు,
బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూను
నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను,
బెల్లం పొడి – అర కప్పు
వెనిలా ఎసెన్స్‌ – కొద్దిగా,
ఉప్పు – చిటికెడు

తయారీ: 

ముందుగా కొర్ర పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు కలిపి జల్లెడ పట్టాలి.

నెయ్యిని ప్లానిటరీ మిక్సర్‌లో వేసి అరగంట సేపు బాగా కలపాలి. జల్లించిన పిండిని, బెల్లం పొడిని జత చేసి మరో ఐదు నిమిషాలు కలిపి బయటకు తీయాలి.

వెనిలా ఎసెన్స్‌ జత చేయాలి. అంగుళం మందంలో పిండిని ఒత్తాలి. బిస్కెట్‌ కటర్‌తో కావలసిన ఆకారంలో బిస్కెట్లను కట్‌ చేయాలి.
Foxtail Millet కొర్ర బిస్కెట్లు తయారు చేయు విధానము
Foxtail Millet కొర్ర బిస్కెట్లు తయారు చేయు విధానము

150 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్‌ చేసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో ఉంచి సుమారు అరగంటసేపు బేక్‌ చేసి బయటకు తీయాలి.

కొద్దిగా చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

కొర్రలు (Foxtail Millet)
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57.

Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa |  Foxtail Millet Bread | Foxtail Millet  Cabbage Muthia | Foxtail Millet  Halwa | Foxtail Millet  Thipi Pongal | Foxtail Millet  Roti | Foxtail Millet kobbari Annam |

Post a Comment

Previous Post Next Post