కొర్రలు క్యాబేజీ ముత్తియాస్‌ తయారు చేయు విధానము

Foxtail Millet  కొర్రలు – క్యాబేజీ ముత్తియాస్‌ తయారు చేయు విధానము

Foxtail Millet Cabbage Muthia Recipe Making In Telugu

కావలసినవి: 

తురిమిన క్యాబేజీ – ఒక కప్పు
కొర్ర పిండి – ఒక కప్పు
పెరుగు – 5 టేబుల్‌ స్పూన్లు
నిమ్మ రసం – ఒక టీ స్పూను
అల్లం + పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూను
పసుపు – అర టీ స్పూను
బేకింగ్‌ సోడా – చిటికెడు
ఉప్పు – తగినంత
పోపు కోసంనెయ్యి/నూనె – ఒక టీ స్పూను
జీలకర్ర – ఒక టీ స్పూను
ఇంగువ – పావు టీ స్పూను
కరివేపాకు – 4 రెమ్మలు
కొత్తిమీర – అలంకరించడానికి తగినంత

తయారీ:  

ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ, కొర్ర పిండి, పెరుగు, నిమ్మ రసం, అల్లం పచ్చి మిర్చి ముద్ద, పసుపు, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి.

ఉండలు చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్‌లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి.

కొర్రలు క్యాబేజీ ముత్తియాస్‌ తయారు చేయు విధానము
కొర్రలు క్యాబేజీ ముత్తియాస్‌ తయారు చేయు విధానము

స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి.

తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్‌ని పోపులో వేసి వేయించాలి.

కొత్తిమీరతో అలంకరించి సాస్‌తో ప్లేట్‌లో ఉంచి అందించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

కొర్రలు (Foxtail Millet)
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57.

Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa |  Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet  Roti | Foxtail Millet kobbari Annam |

Post a Comment

Previous Post Next Post