సిరిధాన్యాలు ఎందుకు తినాలి?
How to use Millets Siridhanyalu for good health
పీచుతో గ్లూకోజ్ కు చెక్
మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే.(Dietary ఫైబర్)మన ఆహరం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది.ఒకేసారిగా ఆర్థిక మొత్తంలో గ్లూకోజ్ ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం, వరి, గోధుమ,ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0 .25 శాతం - 05 %కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్ గా (చెక్కరగా -అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా )మారిపోయి, 100 గ్రాముల ఆహరం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా 'ఒక్కసారిగా' రక్తంలోకి వచ్చి చేరుతుంది.ఇలా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు జరిగితే?వీటికి తోడుగా స్వీట్లు తింటే...?బిస్కెట్లలో, బర్గర్, పిజ్జా లో మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే?అధిక మొత్తాలతో గ్లూకోజ్ ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది.కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది.అనే రోగాలకు దరి తీస్తుంది.
మైదాతో చేసిన పదార్థాలు కేవలం 10 నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు క్లోమ గ్రంథికి బాగా కీడు చేస్తాయి.
సాధారణంగా మన శరీరంలోకి రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్లే) లో ఉండే గ్లూకోజ్ 6 నుండి 7 గ్రాములే. ఆహరం తిన్న తరువాత అది జీర్ణమై, చివరగా గ్లూకోజ్ గా మారి రక్తంలోకి గ్లూకోజ్ రావడం శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లాల్లో అధిక మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు. పెద్దలకు మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోజాగ్రహస్తులకు (మలబద్దకం, ఫీట్స్, మొలలు, మూలశంక ట్రాగ్లిసెరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ. మూత్రపిండాల రోగాలు, హుద్రోగుల వాగేరా అందరికి) మరింత ప్రమాదకరం.
అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి.ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్దీ కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ ను రక్తంలోకి వదులుతుంటాయి.
సిరిధాన్యాల విశిష్టత
సహజ పీచు పదార్ధం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషి అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం (ప్రతి మానవుడికి రోజుకి 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాలా నుండి, ఆకు కూరలు పొందవచ్చు.
ఒక్కొక సిరిధాన్యము కొన్ని రకాల దేహపు అవసరాలను, ప్రతేకమైన రోగనిర్మలను శక్తిని కలిసి వున్నాయి.
వారి, గోధుమలలో పీచు పదార్ధం / ఫైబర్ 0.2 నుండి 1.2 వరకు ఉన్నపటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.
కొర్ర బియ్యం : సమతుల్యమైన ఆహరం. 8 శాతం పీచుపదార్థం తో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు. వారిని పోగొట్టగలిగే లక్షణం నరాల సంభందమైన బలహీనత, convulsion లకు సరైన ఆహరం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదార క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో పాటుగా )నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
అరికాలు బియ్యం : రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రిను వైపు వెళ్లిన వారికీ కూడా అరికెలు మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడు, వైరస్ జ్వరాలతో నీరసించిన వరి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికాలు.
సామ బియ్యం: మగ, ఆడ వారి పునరుత్పత్తు మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సమాలు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఊదా బియ్యం: థైరాయిడు, క్లోమ, గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదా బియ్యం పనికి వస్తాయి.
అండుకొర్ర బియ్యం : మొలలు భగన్దరం మూలశంక, ఫీసురేష్, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు ఎముకలు , ఉదర,ప్రేగుల,చర్మ సంబంధ, క్యాన్సర్లను చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.
Post a Comment