సిరిధాన్యాలను ఎలా వాడాలంటే?
ఒక అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.సమయాభావం ఉంటె ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.
సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి.కలగలిపి వండుకొని తినటం ద్వారా ఎటువంటి లాభం ఉండదు కాక ఉండదు.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్ని వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరి ధాన్యాన్ని వాడాలి. అలాగా ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున తీసుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. వీటితోపాటు కాషాయాలు కూడా తీసుకోగలిగితే మంచిది.
ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యను బట్టి సిరి ధాన్యాలతో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చు.ఉదాహరణకు ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకొని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరఖ్ల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి. ఉదాహరణకు సుగర్,కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటె వారు అరికలు 3 రోజులు, ఉదాలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి .ఈ సమస్యతో పాటు ప్రోస్టేట్ సమస్య కూడా ఉంటె సమాలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.
వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు,పంచదార, కాఫీ, టీ, అయొడైజ్డ్ సాల్ట్, మాంసాహారం, రిఫైన్డ్ ఆయిల్ తప్పనిసరిగా మాని, దీనిని ఒక జీవన విధానం చేసుకోవాలి. పెరుగు మజ్జిగ, వాడుకోవచ్చు, సముద్రపు ఉప్పు, గానుగ నూనె వాడుకోవాలి.
రక్తహీనతకు 3 రోజులు అరికెలు,3 రోజులు సమాలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3రోజులు ఒక్కొక్క సిరిధాన్యం 3 పూటలు తినాలి.
దీనితో పాటు పరగడుపున క్యారెట్ ,ఉసిరి,జామ లేదా బీటురూట్ రసం తీసుకోవాలి. సాయంత్రం 20 కరివే పాకు ఆకులు 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి 15- 20 నిమిషాల తరువాత భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారించబడుతుంది.
ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చు. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా ఉంటాయి. సిరిధాన్యాలకు 5 - 6 రేట్లు నీరు పోసి 4 -5 గంటలు నానబెట్టి, ఆ తరువాత గంజిలాగా వండుకొని రోజులో ఎప్పుడైనా, ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు.
థైరాయిడ్: ఈ సమస్య ఉన్న వారు 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు,ఒక రోజు ఊదాలు, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అందు కొర్రలు, వండుకొని మూడు పూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సమాలు , తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరి ధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కాషాయం ఒక వారం, పుదీనా ఆకుల కాషాయం ఒక వారం, తమలపాకుల కాషాయం ఒక వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. గంగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజు ఉదయం 3చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే 20 వారాలలో అన్ని రకాల మందులు మానివెయ్యవచ్చు.రోజు తప్పనిసరిగా "నడక"మర్చిపోకూడదు.
ఏ ఆహార పదార్థ గుణగణాలైన దానిలో ఉండే పీచు, పిండి పదార్థాల నిష్పత్తి ని బట్టి నిర్ణయింపబడతాయి. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉంటె రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహరం కింద లెక్క. ఈ సిరిధాన్యాలల్లో ఈ నిష్పత్తి 5 .5 నుండి 8 .8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 3 .85 ఉంటుంది.ముడి బియ్యం, గోధుమలల్లో కూడా నిష్పత్తి పెద్దగా తేడా లేదు.
Post a Comment