May 23, 2019

Srikaanth

సిరి ధాన్యాలను ఎందుకు ముఖ్య ఆహారంగా ఆహ్వానించాలి

 సిరి ధాన్యాలను మన జీవితాల లోకి ఎందుకు ముఖ్య ఆహారంగా ఆహ్వానించాలి ?
Reasons to eat Millets everyday in our life

10 కారణాలు : 

1 . తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI )  కలిగిన ఆహార ధాన్యాలు : ఈ నాటి వరి అన్నం లాగ, గోధుమల లాగ, మైదా పదార్థాలు లాగ ఈ ధాన్యాలు మన పొట్ట లో ప్రవేశించిన 15  నుండి 35  నిమిషాలలో అధిక మొత్తాలలో గ్లూకోజు ను రక్తం లోకి పంపించవు.

ఈ సిరి ధాన్యాలు 5 నుండి 7 గంటల పాటు మెల్ల మెల్లగా కొద్ది ప్రమాణం లో గ్లూకోజును రక్తం లోకి వదులుతాయి. అందుకే మధుమేహం వంటి రోగాలనూ, అనేక ఇతర రోగాలను నిరోధించ గలుగుతాయి.

2 . క్షార గుణాన్ని కలుగ చేసే ఆహారాలు. కనుకనే క్యాన్సర్ లు కూడా పోరాడుతాయి. గ్లూటెను లేని ఆహార ధాన్యాలు మన సిరి ధాన్యాలు (Gluten free).

Reasons to eat Millets everyday in our life
Reasons to eat Millets everyday in our life


3  మనకి కావలసినట్లుగా అధిక ప్రమాణం లో ఫైబర్ కలిగినవి. (8 నుండి 12 .5 శాతం దాకా). ఈ ఫైబర్ వల్లనే చక్కటి గ్లూకోజు నియంత్రణ వీలవుతుంది. ఫైబర్ వల్ల లాభాలు అనేకం.కేవలం ముఖ్య ఆహారం ద్వారానే 25 -28  గ్రాముల ఫైబర్ రోజుకి లభించగలదు.

4 . అధికం గా థయామిన్, నియాసిన్, రైబో ఫ్లఆవిన్ లు ఉన్నాయి.చక్కటి హృదయ, మెదడు, కండరాల సంబంధమైన ఆరోగ్యం లభిస్తుంది.

5  సూక్ష్మ పోషకాలు : మెగ్నీషియం, జింక్, మెగ్నీషియం, సెలీనియం, రాగి మొదలైనవి మనకు అందుతాయి. మన చిన్న ప్రేగులలో పూత గా చేరిన మిల్లెట్ ల ఫైబర్ వలన కూడా నీటిని, ఈ పోషకాలను పీల్చుకోవటం చక్కగా జరుగుతుంది.
కొర్ర బియ్యం లో 12 .5  శాతం ప్రోటీనులు కూడా ఉన్నాయి. తక్కిన వాటి లో 6  శాతం దాకా. ప్రతీ మిల్లెట్ ధాన్యానికి మన లోని కొన్ని ప్రత్యేక అంగాల మీద ప్రభావం చూపగలిగే లక్షణం ఉంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం వీలవుతుంది.

6   అన్ని ధాన్యాలూ ముఖ్య ఆహారం గా తినటం ద్వారా ఊబ కాయం, మధుమేహం, మోకాళ్ళ నొప్పులూ, కీళ్ల నొప్పులూ, స్త్రీల లో గర్భకోశపు సమస్యలూ, థైరాయిడ్ స్సమస్యలూ, క్యాన్సర్ లూ, హృదయ, మూత్ర పిండాల, మెదడు యొక్క, నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాలు బాగు చేసు కోవచ్చు.

Read More:

Best Edible Cooking Oil Which Oil Suits For Indian Recipes

7. పోలిష్ చేయని సిరి ధాన్యాల లో తగినంత నీటి లో కరిగే, ఇంకా కరగని ఫైబర్(Soluble & insoluble fiber), ఇంకా కాల్షియమ్, పొటాషియం, ఫోస్ఫర్వ్స్ వగైరా అన్నీ చక్కగా ఉన్నాయి.

8.  సిరి ధాన్యపు పంటలు ఎటువంటి నేలల్లో అయినా పెరుగుతాయి. 5 -6  వానలు కురిస్తే కోతలకు రాగలవు. ఎరువులూ, పురుగు మందులూ అక్కర్లేదు . ధాన్యాలను తాలు తీయకుండా కొన్ని సంవత్సరాలు పదిలంగా దాచుకోవచ్చు.

9 .   పూర్తిగా సేంద్రియమైనవి. పంట గింజలనే విత్తనాలు గా వాడుకోవచ్చు. రైతు పూర్తి గా స్వయం ప్రతిపత్తి పొందుతాడు.

10. సిరి ధాన్యాల తో అన్ని వంటకాలు చేసుకోవచ్చు. పోలిష్ చేయని సిరి ధాన్య మిల్లెట్ ల ను 5 - 6 గంటల పాటు నాన పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. రాత్రి నాన పెట్టి ఉదయాన్నే వండండి. మధ్యాహ్నం నాన పెట్టి రాత్రి వండండి.
సిరి ధాన్య మిల్లెట్ లతో అన్నం, రొట్టె, పొంగలి, ఉప్మా, ఇడ్లీ, దోశ, బిరియాని - అన్నీ చేసుకోవచ్చు.

ఇంకా ఆలస్యమెందుకు? సిరి ధాన్యాలను నేడే మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. మీ పిల్లలకూ వీటిని పరిచయం చేయండి. రేపటి అద్భుతమైన ఆహారాన్ని వారికీ అందించండి.

మీకు మరి 'రోజువారీ అవసరమైన ఫైబర్ మోతాదు' ప్రమాణాన్ని - అంటే 38  గ్రాముల ఫైబర్ ను ఎవరు అందించగలరు?
సిరి ధాన్యాలు మాత్రమే !
ఇలా ఫైబర్ మీకు కూరగాయలూ, పళ్ళ నుండి కూడా దొరకదు. ఎందుకంటే అవి 80 నుండి 95 శాతం వరకూ నీటి తో చేయబడి ఉంటాయి కనుక ! (చాలా అధికమైన మొత్తాల్లో తినవలసి ఉంటుంది. అసాధ్యం)

ఈనాటి వరి అన్నం, గోధుమ ఆహార పదార్థాల్లో ఫైబర్ శాతం ౦.2 నుండి 1 శాతం మాత్రమే. మైదా లో ఫైబర్ శున్యం. 

అందుకే మీరు సిరి ధాన్యాలను నేడే మీ జీవితాల్లోకి ఆహ్వానించండి.

కొర్ర బియ్యం- Foxtail Millet (Korra Biyyam/Kangni),
సామెలు బియ్యం- Little Millet (Saamelu Biyyam/Kutki),
అరికెల బియ్యం -Kodo Millet(Arikalu Biyyam/Kodra),
ఊదలు బియ్యం -Barnyard Millet (Oodalu Biyyam/Jhingora),
అండు కొర్రలు బియ్యం- Browntop Millet(Andu Korralu),

ఈ 'పంచ రత్న సిరిధాన్యాలు' అన్నిటి లోనూ  8 నుండి  12.5% ఫైబర్ ఉంది.


https://mytecbooks.blogspot.com/2019/05/reasons-to-eat-millets-everyday-in-our.html
Subscribe to get more Posts :