ఎక్కువ సమయం పనిచేసేది భారతీయులే

ఎక్కువ సమయం పనిచేసేది భారతీయులే

Indians are the most hard-working employees in the world

ప్రపంచలోనే ఎక్కువ సమయం శ్రమిస్తున్న వారి లిస్టులో భారతీయులే ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. పట్టణాల్లో ఉన్నవారు వారానికి 53 -54 గంటలు పనిచేస్తుండగా, గ్రామాల్లో 46-47 గంటలు పని చేస్తున్నట్లు సర్వే లో స్పష్టం చేశారు. సర్వేను జూన్ 2017 నుండి జూలై 2018 కాలంలో నిర్వహించారు..

ప్రపంచంలో కార్మిక సంస్థలు నిర్ణయించిన సగటు పని గంటలు 48 కంటే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ కార్మిక విభాగం కూడ తెలిపింది. అయితే గతంలో కంటే ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు పలువురు తెలిపినట్టు నివేదికలో తెలిపింది.

Indians are the most hard-working employees in the world
Indians are the most hard-working employees in the world

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) సంస్థ ప్రకారం ప్రపంచంలో దక్షిణాసియాతో పాటు తూర్పు ఏషియా దేశాలు దేశాలు వరుసగా వారంలో 46.4, 46.3 గంటలు పని చేస్తున్నట్లుగా ఉంది. నేపాల్ లో 54 సరాసరి పని గంటలు ఉండగా మాల్డీవ్ లలో 48 గంటలు, బంగ్లాదేశ్ లో 47 గంటలు, మలేషియా, చైనాలో 46 గంటలు గా ఉంది.

అభివృద్ది చెందిన దేశాల్లో వారానికి 43 గంటలు ఉండగా ఇండియాలో మాత్రం 52 శాతానికి పైగా గ్రామీణులు, 70 శాతం పట్టణ ప్రజలు 48 గంటలకంటే ఎక్కువగా పని చేస్తున్నట్టు సర్వే నివేదిక తెలిపింది.

Post a Comment

Previous Post Next Post