గొంతునొప్పి తగ్గాలంటే వీటిని తీసుకోవాలి

గొంతునొప్పి తగ్గాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Home remedies for throat pain and cough

గొంతు నొప్పి అనేది సాధార‌ణంగా మ‌న‌కు త‌ర‌చూ వ‌స్తూనే ఉంటుంది. ఇక సీజ‌న్ మారిన‌ప్పుడు కూడా గొంతు నొప్పి వ‌చ్చి మ‌న‌ల్ని చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. గొంతులో నొప్పి, ఇన్‌ఫెక్ష‌న్‌, మంట‌, స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోవ‌డం వంటి ఇబ్బందులు అన్నీ దీంతో వ‌స్తాయి. అయితే ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే ప‌లు స‌హ‌జ సిద్ధ ప‌దార్థాలు చాలు. అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అక్క‌ర్లేదు. ఈ క్ర‌మంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్‌గా త‌గ్గించుకునేందుకు ఏం చేయాలో, ఏయే ప‌దార్థాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Home remedies for throat pain and cough
Home remedies for throat pain and cough

1. గొంతు నొప్పి, ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటే వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా స‌మ‌స్య‌లకు చికెన్ సూప్ ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అంతేకాదు, జ‌లుబు ఉన్నా పోతుంది.

2. ల‌వంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క‌, అల్లం వంటి ప‌దార్థాల‌ను వేసి టీ త‌యారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. ఈ మ‌సాలా టీతో గొంతు నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్ నివారించ‌బ‌డుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి.

3. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్క‌ల‌ను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో చిక్క‌ని అల్లం ర‌సం వ‌స్తుంది. అప్పుడు ఆ ర‌సాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్ష‌ణాల్లో త‌గ్గుతుంది.

4. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం, తేనెల‌ను క‌లుపుకుని తాగాలి. వీటిలో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు గొంతు నొప్పిని త‌గ్గిస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్ల‌ను పోగొడ‌తాయి. జ‌లుబు కూడా త‌గ్గుతుంది.

5. మిరియాల‌తో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మ‌రిగించిన పాల‌ను తాగుతుంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు కూడా మాయ‌మ‌వుతాయి.

Post a Comment

Previous Post Next Post