వేసవిలో తాటిముంజ పుచ్చపండు తినడం మంచిది

వేసవిలో తాటిముంజ,పుచ్చపండు తినడం మంచిది..
Nutritional Benefits of Palmyra Fruit Nutritional benefits of watermelon fruit

వేసవి వచ్చిందంటే చాలు.. భానుడి తాపాన్ని తట్టుకునేందుకు జనాలు నానా అవస్థలు పడుతుంటారు. చాలామంది ఉపశమనం  కోసం కూల్​డ్రింక్స్​ తాగుతుంటారు. అయితే, ప్రకృతి ప్రసాదించే పుచ్చపండు, తాటిముంజలను తినడం ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి.

ఎండాకాలంలో పండ్లకు బాగా గిరాకీ ఉంటుంది. అందులోనూ పుచ్చపండుకు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానిలో పోషకాలతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తింటే దాహం ఇట్టే తీరిపోతుంది. అందుకే ఎక్కువ మంది పుచ్చపండును ఇష్టపడుతుంటారు. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు వేడిని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు, విటమిన్లతో పాటు యూరీజ్ అనే ​ఎంజైమ్ ఉంటుంది. పుచ్చపండు రసంలో సిట్రులిన్ 0.17 శాతం ఉంటుంది. ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. దీని రసం కిడ్నీలో రాళ్లు​, మధుమేహ వ్యాధి నివారణకు సహాయపడుతుంది. శరీరంలో ఉన్న సోడియాన్ని బయటకు పంపి విరేచనాలను తగ్గించేందుకు ఉపకరిస్తుంది.

జోరందుకున్న అమ్మకాలు

ఎండలు మండుతుండటంతో మార్కెట్లలో పుచ్చపండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. వీటిని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిరు వ్యాపారులు కూడా రోడ్లమీద తోపుడు బండ్లపై పుచ్చపండు ముక్కలు అమ్ముతున్నారు. అంతేకాకుండా పుచ్చపండు జ్యూస్​నే ఎక్కువ మంది తాగుతున్నారు అని జ్యూస్​ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు.

ఉపయోగాలు
  • మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, మూత్ర కోశంలో సమస్యలు ఉన్నవాళ్లు పుచ్చపండు తింటే చక్కని ఔషధంగా పనిచేసి ఉపశమనం       లభిస్తుంది.
  • గ్లాసు పుచ్చకాయ రసంలో కొంచెం తేనె కలుపుకుని ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
  • మలబద్ధకం ఉన్నవాళ్లు ప్రతిరోజు ఫుచ్చకాయ తింటే సమస్య తీరుతుంది.
  • పెదవులను తడిగా ఉంచుతుంది.
  • శరీరంలో క్యాల్షియాన్ని పెంచుతుంది. దాంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • పుచ్చపండు గింజల్లో కూడా అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల శరీరానికి మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతుంది.
  • ఇందులో 92శాతం నీరు ఉంటుంది. ఇవి తినడం వల్ల ఎండాకాలంలో మన శరీరం కోల్పోయిన నీరు తిరిగి భర్తీ చేయవచ్చు.
  • పుచ్చపండు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
  • లివర్‌‌ను శుభ్రం చేయడంతోపాటు రక్తంలో యూరిక్ యాసిడ్‌‌ను తగ్గిస్తుంది.
  • దీనిలో లైకోఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులు, పేగు క్యాన్సర్‌‌, మధుమేహాన్ని ఇది దూరం చేస్తుందని    నిపుణులు చెప్తున్నారు.
Nutritional Benefits of Palmyra and Watermelon Fruit
Nutritional Benefits of Palmyra and Watermelon Fruit

ముంజలోయ్​.. తాటి ముంజలు..

ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటిముంజలు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం చాలా రకాల కాయలపై పక్వానికి రావడానికి రసాయనాలు చల్లుతున్నారు. వాటి ప్రభావం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, తాటి ముంజలు సహజ సిద్ధంగా మాత్రమే పక్వానికి వస్తాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటితో శరీరానికి కీలకమైన పోషకాలు కూడా అందుతాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

తాటిముంజల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బీ, సీలతోపాటు ఐరన్,  జింక్,  పొటాషియం లాంటి ఖనిజ లవణాలను ఇస్తుంది. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు ఎక్కువగా కోల్పోతారు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతారు.  అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరేచనాల బారిన పడే వాళ్లకు తాటి ముంజలు తినిపిస్తే సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇవి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే వస్తుంది. దాంతో యాక్టివ్​గా ఉంటారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌‌‌‌ను అడ్డుకునే గుణం కూడా వీటికి ఉంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి.  రక్తపోటు అదుపులో
ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.  అధిక బరువును నియంత్రిస్తుంది.

పోషకాలు పుష్కలం

తాటి ముంజల్లో అనేక పోషక విలువలున్నాయి. ​ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎండ నుంచి ఉపశమనం ఇస్తాయి. అంతేకాకుండా శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

Post a Comment

Previous Post Next Post