నువ్వులు వాడవలసిన అవసరం ఉన్నవారికి వారికి కొన్ని సూచనలు

డాక్టర్ ఖాదర్ చెప్పినట్లు నువ్వులు వాడవలసిన అవసరం ఉన్నవారికి వారికి కొన్ని సూచనలు. 
Tips For Who Want to take sesame seeds

నువ్వులను షాప్ లో కొని తెచ్చి నేరుగా వాడకండి. తెచ్చిన తరువాత ఈ క్రింద చెప్పిన విధంగా శుభ్రం చేయండి!

1. నువ్వులను ముందుగా జెల్లెడలో జెల్లించండి.

2. తరువాత పళ్లెం లో పోసి అందులోని సాగుడు పురుగులు, బూజు, దెబ్బతిన్న గింజలు ఇలా అన్నిటినీ ఏరిపారేయండి. బూజుకు గింజలు అతుక్కుని గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి, అలాంటి గుత్తులను మొత్తంగా ఏరి పారేయండి. గుత్తులనుండి గింజలను బూజును వేరు చేసి ప్రయత్నం చేయకండి.

3. ఇప్పుడు నువ్వులను చిన్న రంధ్రాలున్న గిన్నెలోనో లేక వడగట్టే స్టీల్ ఫిల్టర్లోనో పోసి కుళాయి కింద పెట్టి నీటిని వదలి చేత్తో నువ్వులను కలియబెట్టండి. కావాలంటే దీనికి ముందు, నువ్వులను ఒక 10 నిమిషాలు గిన్నెలో నీళ్లుపోసి నానబెట్టి చేత్తో బాగా తిప్పి, ఆ నీటిని పారబోయండి. ఇలా నీటిలో శుభ్రం చేసాక, నువ్వులను ఎండలో ఒకరోజు ఆరబెట్టండి. తరువాత ఫ్యాన్ కింద ఒకరోజు ఆరబెట్టండి. తరువాత నువ్వులను దోరగా వేయించి చల్లబడ్డాక గాజు సీసాలో పోసి పెట్టుకోండి.
Tip For Who Want to take sesame seeds
Tip For Who Want to take sesame seeds

ఖాదర్ సారు చెప్తున్న విధానంలో మనకు నువ్వులు 2 సందర్భాల్లో అవసరం ఉంటుంది. ఒకటి, మైగ్రేన్ సమస్యకు రోజు ఒక చెంచా నువ్వులు దోరగా వేయించి నమిలి తినాలి. రెండు, వారానికి ఒక సారి దాదాపు 50 గ్రాముల నువ్వులలో లడ్డు చేసుకుని తినాలి. ఈ రెండు సందర్భాల్లోకూడా వారానికి 50గ్రాముల నువ్వులు మాత్రమే అవసరం అవుతాయి. మనకు షాప్స్ లో 50 గ్రాముల నువ్వుల ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి ఇవి ఏవారానికి ఆవారం తెచ్చి వాడుకోండి. నువ్వులు సరిగా ఆరబెట్టక తడి ఉంటే, మళ్ళీ బూజు పడుతుంది, పురుగు పడుతుంది, మొలకలెత్తే అవకాశం కూడా ఉంది.

ఇలా శుభ్రమైన నువ్వులని మాత్రమే మనం కడుపులోకి తీసుకోవాలి. పొలాలనుండి వచ్చే నువ్వులలో ప్రమాదకరమైన అఫ్లో టాక్సిన్స్ విషాలను కలిగిఉండే ఫంగస్/మోల్డ్ అనేవి సులభంగా వస్తాయి. నువ్వులు, వేరుశెనగలలో ఈ విషపదార్థాలు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ టాక్సిన్స్ దేహంలో క్యాన్సర్స్, లివర్ సిరోసిస్, ఆటో ఇమ్యూన్ డీసీసెస్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులను కలిగిస్తాయి.

దయచేసి అందరూ ఈ జాగ్రత్తలు పాటించి నువ్వులను వాడి అందులోని అద్భుత ఔషద గుణాలను మీ దేహానికి అందివ్వండి!

Post a Comment

Previous Post Next Post