April 9, 2019

Srikaanth

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Foods to reduce bad cholesterol In Your Body

లో డెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డీఎల్‌)నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది మ‌న శ‌రీరంలో ఎక్కువ‌గా ఉంటే అనేక వ్యాధులు వ‌స్తాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాల‌ని, మంచి కొలెస్ట్రాల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్ లేదా హెచ్‌డీఎల్‌)ను పెంచుకోవాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మ‌రి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోవాలంటే రోజూ ఒక యాపిల్ పండు తినాలి. అందుకే అంటారు, రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాద‌ని. యాపిల్ లో ఉండే పోషక ప‌దార్థాలు లివ‌ర్ త‌యారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. కొవ్వును క‌రిగిస్తాయి.

2. బీన్స్‌లో పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) స‌మృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ త‌యారు కాకుండా చూస్తుంది. ఉన్న కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తుంది.

3. ద్రాక్ష‌ పండ్ల‌లో ఆంతో సైనిన్స్, టానిన్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను బ‌య‌ట‌కు పంపుతుంది.

Foods to reduce bad cholesterol In Your Body
Foods to reduce bad cholesterol In Your Body

4. జామ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి, పాస్ఫ‌ర‌స్‌, నికోటిన్ యాసిడ్‌, ఫైబ‌ర్‌లు శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తాయి.

5. పుట్ట‌గొడుగుల్లో విట‌మిన్ బి, సి, కాల్షియం, ఇత‌ర మిన‌రల్స్ ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి.


https://mytecbooks.blogspot.com/2019/04/foods-to-reduce-bad-cholesterol-in-your.html
Subscribe to get more Posts :