Cell Mobile Smart Phone Radiation Checking Code

 రేడియేషన్.. తెలుసుకోండిలా..

స్మార్ట్‌ ఫోన్ కొనే ముందు అందరూ చూసేది ధర, ఫీచర్స్. కానీ అసలు స్మార్ట్‌ ఫోన్ కొనేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదే రేడియేషన్ లెవెల్. మితిమీరుతున్న వాడకంవల్ల రేడియేషన్‌‌ ప్రభావం పడుతోందని, దీనివల్ల మెదడుకు ప్రమాదమని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. మనం వాడే స్మార్ట్‌ ఫోన్ లో రేడియేషన్ లెవెల్ ఎంత ఉందో ఫోన్లో చెక్ చేసుకోవచ్చన్న సంగతి చాలా మందికి తెలీదు.


మన ఫోన్లలో ‘స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ ను బట్టి రేడియేషన్ ఎంతుందో తెలుసుకోవచ్చు. దీన్ని సార్ (SAR ) వాల్యూ అంటారు. సార్ స్థాయి 1.6 W/ KG ఉంటే సేఫ్ కింద లెక్క. అంతకన్నా మించితే ప్రమాదమున్నట్టు. అంతే కాకుండా మొబైల్ డివైస్ వినియోగాన్ని తగ్గించినపుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్లను ఉపయోగించినా కూడా ఫోన్ రేడియేషన్ ను తగ్గించవచ్చు. సాధారణంగా పెద్ద బ్రాండ్స్ ఫోన్లు తక్కువ సార్ వాల్యూ కలిగి ఉంటాయి.

సార్ వ్యాల్యూ ఇలా చెక్ చేయండి

మీ స్మార్ట్‌ ఫోన్ డైలర్ ను ఓపెన్ చేయండి. డయలర్ లో *#07# అని టైప్ చేయండి. స్మార్ట్‌ ఫోన్ సార్ రేటింగ్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది.

Post a Comment

Previous Post Next Post