3 నిమిషాల్లోనే ముక్కలైన మూడు ముళ్ల బంధం

3 నిమిషాల్లోనే ముక్కలైన మూడు ముళ్ల బంధం

Wife Divorces husband 3 minutes after Marriage

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఓ జంట..మూడు నిమిషాలకే విడిపోయారు. ఈ సంఘటన కువైట్ లో ఇటీవల జరగగా ప్రస్తుతం వైరల్ అయ్యింది. కువైట్‌ లో ఓ జంట జడ్జి ముందే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పెళ్లికూతురు పొరపాటున కింద పడింది.

పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి.. కింద పడినందుకు కోపంగా చూశాడట.  అంతే ఒక్కసారిగా సీరియస్ అయిన వధువు.. జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడగటం.. ఆయన ఇవ్వడం చకచకా జరిగిపోయింది.

Wife Divorces husband 3 minutes after Marriage
Wife Divorces husband 3 minutes after Marriage

మూడు నిమిషాల్లోనే ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కువైట్‌ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఇంతకుముందు దుబాయ్‌ లో ఓ జంట 15 నిమిషాల్లో  విడాకులు తీసుకున్నా.. వీరు 3 నిమిషాల్లోనే విడిపోయారని తెలిపింది. ప్రపంచంలోనే సూపర్ ఫాస్ట్ గా విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Post a Comment

Previous Post Next Post